­
Prabhas 2 PrabhasFans: Rebel Movie Story Line

Thursday, 17 May 2012

Rebel Movie Story Line









:x  ప్రభాస్ 'రెబల్‌' చిత్రం కూడా చేస్తున్నారు. లారెన్స్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో అతని పాత్ర ఢిఫెరెంట్ గా ఉంటుందని చెప్తున్నారు. దాని గురించి చెపుతూ...అతను నిరంతరం మండే అగ్నిగోళంలాంటివాడు. మిట్టమధ్యాహ్నం సూర్యుడు ఎలా భగభగలాడుతూ కనిపిస్తాడో... అతను అలానే ఉంటాడు. ఆ సెగను ఆపడం ఎవరి తరం కాదు. బుల్లెట్‌ అయితే ఒక గుండెనే చీల్చుతుంది. అతను మిస్సైల్‌..ఒక్కసారిగా శత్రు స్థావరాన్ని మట్టుపెట్టేస్తాడు. ఇదంతా ప్రత్యర్థులకే. ప్రేమిస్తే మాత్రం సాయంకాలపు చిరుగాలిలా ఆహ్లాదాన్ని పంచుతాడు. ఇంతకీ అతగాడి కథేంటో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే అంటున్నారు లారెన్స్‌.   :x 

'రెబల్‌'లో ప్రభాస్ సరసన తమన్నా, దీక్షాసేథ్‌ హీరోయిన్స్ గా చేస్తున్నారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో ఫైట్స్ సీన్స్ తెరకెక్కిస్తున్నారు. వీటికి రామ్‌ లక్ష్మణ్‌ నేతృత్వం వహిస్తున్నారు. నిర్మాతలు జె.భగవాన్‌, జె.పుల్లారావు మాట్లాడుతూ ''రెబల్‌ అని పిలిపించుకొనే ఆ యువకుడి లక్ష్యం ఏమిటి? ఆ పేరు అతనికి ఎందుకొచ్చింది? అనేది కథలో ఆసక్తికరమైన అంశం. ప్రభాస్  శైలికి అనుగుణంగా ఉండే కథ ఇది. యాక్షన్‌ సన్నివేశాలు అలరిస్తాయని''చెప్పారు. ఈ చిత్రంలో ఓ కీలక పాత్రను 
కృష్ణంరాజు పోషిస్తున్నారు. :x


___ప్రభాస్2ప్రభాస్ ఫాన్స్ ___1289

No comments:

Post a Comment